Drinking water more that required during lunch is not advised

భోజనం చేసిన వెంటనే నీరు త్రాగటం విషంతో సమానం’ అని మహర్షి వాగ్భటులు అంటారు. దీనిగురించి వివరంగా తెలుసుకుందాం. శరీరంలో ముఖ్యభాగం పొట్ట. పొట్ట భాగం లోపలి స్థానం జఠరాగ్ని, అంటే జీర్ణాశయం. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరు తుంది. అక్కడ అగ్ని పుడుతుంది. ఆ అగ్ని తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఈ సమయంలో మనం గటగటా నీళ్ళు తాగితే జఠరాగ్ని చల్లబడుతుంది. మండుతున్న కట్టెమీద నీళ్ళు పోస్తే ఆరిపోతుంది కదా, అలా.

కొందరైతే లోటాలతో నీరు త్రాగేస్తారు. అన్నం కంటే ఎక్కువ నీరు తాగేవారు కూడా ఉన్నారు. అలా వెళ్ళిన నీరు అగ్నిని చల్లబరుస్తుంది. ఇక తిన్నది అరగదు. కుళ్ళిపోతుంది. గ్యాస్‌ట్రబుల్‌ సమస్యకు మొదటి మెట్టు అదే. దీనివల్ల గొంతులో మంట, ఛాతీలో మంట, గుండెలో మంట వస్తుంది. ఈ కుళ్ళిన ఆహారం నుండి వచ్చే గ్యాస్‌ అనబడే ఆ విషవాయువు శరీరమంతటా వ్యాపిస్తుంది. ఇలాంటి వాయువు వల్ల 103 రోగాలు వస్తాయని చెప్పారు వాగ్భటాచార్యులు. వాటిలో మొదటిది ఎసిడిటీ. తరువాత హైపర్‌ ఎసిడిటీ, అల్సర్‌, పెప్టిక్‌ అల్సర్‌, క్రమంగా ఆర్ష మొలలు, మూలవ్యాధి, భగందర రోగము. ఈ క్రమంలో చివరగా వచ్చేది క్యాన్సర్‌ (కర్కాటక రోగం).

మంచినీళ్ళు ఎప్పుడు తాగాలి..

మరి మంచినీళ్ళు ఎప్పుడు తాగాలి, దీనికి వాగ్భటులు చెప్పిన సూత్రం కనీసం గంటన్నర తర్వాత నీళ్ళు తాగండి అని. ఎందుకంటే తిన్న ఆహారం జఠరస్థానంలో గంటన్నర వరకు జీర్ణమవుతూనే ఉంటుంది. కనుక భోజనం చేసిన గంటన్నర తర్వాత నీళ్ళు తాగితే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. మరి భోజనానికి ముందుగానీ, మధ్యలోగానీ నీరు తాగవచ్చా అంటే వాగ్భటులంటారు, భోజనానికి ఒక గంట ముందు నీరు తాగవచ్చు. భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే, దీనికి వాగ్భటులు ఎంతో వైజ్ఞానికమైన సూత్రం చెప్పారు.. అది ఏంటంటే మనం తినే ఆహారంలో రెండు రకాల పదార్థాలుంటే, అంటే ఒకటి గోధుమ రొట్టె, రెండవది వరి అన్నం. ఇలా రెండు రకాల పదార్థాలు ఉంటే, మొదటి పదార్థం పూర్తిచేసి రెండవరకం పదార్థం మొదలుపెట్టే ముందుగా కాస్త నీరు త్రాగవచ్చు. కాస్త అంటే రెండు లేక మూడు గుటకలు. ఇక పూర్తిగా భోజనం ముగించే వరకు నీరు తాగకూడదు. భోజనం ముగించాక గొంతు సాఫీగా ఉంచటానికి మరో రెండు గుటకలు నీరు త్రాగవచ్చు. కేవలం గొంతు శుద్ధికోసమే. మరి నీరు కాకుండా మరేదైనా తీసుకోవచ్చునా అంటే, మజ్జిగ తీసుకోవచ్చు. పెరుగును చిలికి వెన్న తీసివేసిన తర్వాత మిగిలే పదార్థం మజ్జిగ. భోజనం తర్వాత తీసుకోతగిన ఉత్తమమమైన ద్రవం మజ్జిగ.

నీరు ఎలా తాగాలి..

మనం తెలుసుకోవలసిన మరొక సూత్రం నీరు ఏలా తాగాలనేదాని గురించి. కొందరైతే లోటాని నోటికి కరిపించుకుని గటగటా తాగేస్తారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. నీటిని గుటక గుటకగా తాగాలి. ఒక్కొక్క గుటక నోటిలో నింపుకుంటూ చప్పరిస్తూ తాగాలి. ఇదీ.. నీరు తాగే సరియైన విధానం. మనం వేడి వేడి పాలు తాగుతాం కదా అలాగే నీటిని తాగాలి. ఎందుకంటే నోటిలో లాలాజలం (క్షారం) తయారవుతుంది. పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి. ఇవి రెండూ కలిస్తే న్యూట్రల్‌ అవుతాయి. ఇలా ఎవరి కడుపు భాగం న్యూట్రల్‌గా ఉంటుందో వారి ఆయుర్దాయం నూరు సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి మనం నీటిని గుటక గుటక చప్పరిస్తూ తాగితే ఆ నీరు నోటిలోని లాలాజలంతో కలిసి పొట్టలోకి చేరుతుంది. లాలాజలం పొట్టలోని ఆమ్లాలతో కలిసి న్యూట్రల్‌ అవుతుంది. కాని నీటిని గటగటా తాగితే నోటిలోని లాలాజలం పొట్టలోకి చేరదు. అసలు నోటిలో లాలాజలం తయారయ్యేదే పొట్టలోకి వెళ్ళటానికి. లోపలి ఆమ్లాలని శాంతింప చెయ్యటానికీ.

మనమే కాదు జంతువులను గమనిస్తే కూడా ఈ విషయం మరింత అర్థమౌతుంది. పిచ్చుకని చూడండి, నీటిని చప్పరిస్తూ ఒక్కొక్క గుటకగా తాగుతుంది. అలాగే కుక్కలు, ఇంకా మరిన్ని జంతువులు ఈ నియమాన్నే అనుసరిస్తాయి. కనుకనే గుండె జబ్బులు, మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలు వాటికి ఉండవు. కనుక మనం నీటిని చప్పరిస్తూ తాగుదాం.

మెడిసిన్‌ మన లాలాజలం

మన నోటిలోని లాలాజలం ఒక మెడిసిన్‌. ఎలాగంటే, మీరు గమనించే ఉంటారు.. ఏదైనా జంతువుకి దెబ్బ తగిలితే అది ఆ దెబ్బ తగిలిన చోట నాకుతూ ఉంటుంది. నాకగా నాకగా ఆ దెబ్బ తగ్గిపోతుంది. ఎందుకంటే లాలాజలం ఒక మెడిసిన్‌. ఎవరైతే లాలాజలం ఉమ్ముతారో వారు దురదృష్ట వంతులు. ఉదాహరణకి గుట్కాలు తినేవారు. భగవంతుడు ఈ లాలాజలాన్ని తయారుచెయ్యటానికి లక్షగ్రంథులని నియమించాడు. మనం ఆరోగ్యంగా జీవించటానికే ఈ ఏర్పాటు. నిజానికి మనం ఉమ్మ వలసిన సమయం కఫం వచ్చినప్పుడు మాత్రమే.

– రాజీవ్‌ దీక్షిత్‌ ఉపన్యాస సంకలనం

‘ఆరోగ్య రహస్యాలు’ పుస్తకం ఆధారంగా

Comments

Popular posts from this blog

Cancer Awareness food concern...

Munagaku... కల్పవృక్షం..! Natural Health Tips

Corelation between Heart and health.... Listern to your heart....