Drinking water more that required during lunch is not advised
భోజనం చేసిన వెంటనే నీరు త్రాగటం విషంతో సమానం’ అని మహర్షి వాగ్భటులు అంటారు. దీనిగురించి వివరంగా తెలుసుకుందాం. శరీరంలో ముఖ్యభాగం పొట్ట. పొట్ట భాగం లోపలి స్థానం జఠరాగ్ని, అంటే జీర్ణాశయం. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరు తుంది. అక్కడ అగ్ని పుడుతుంది. ఆ అగ్ని తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఈ సమయంలో మనం గటగటా నీళ్ళు తాగితే జఠరాగ్ని చల్లబడుతుంది. మండుతున్న కట్టెమీద నీళ్ళు పోస్తే ఆరిపోతుంది కదా, అలా. కొందరైతే లోటాలతో నీరు త్రాగేస్తారు. అన్నం కంటే ఎక్కువ నీరు తాగేవారు కూడా ఉన్నారు. అలా వెళ్ళిన నీరు అగ్నిని చల్లబరుస్తుంది. ఇక తిన్నది అరగదు. కుళ్ళిపోతుంది. గ్యాస్‌ట్రబుల్ సమస్యకు మొదటి మెట్టు అదే. దీనివల్ల గొంతులో మంట, ఛాతీలో మంట, గుండెలో మంట వస్తుంది. ఈ కుళ్ళిన ఆహారం నుండి వచ్చే గ్యాస్ అనబడే ఆ విషవాయువు శరీరమంతటా వ్యాపిస్తుంది. ఇలాంటి వాయువు వల్ల 103 రోగాలు వస్తాయని చెప్పారు వాగ్భటాచార్యులు. వాటిలో మొదటిది ఎసిడిటీ. తరువాత హైపర్ ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్, క్రమంగా ఆర్ష మొలలు, మూలవ్యాధి, భగందర రోగము. ఈ క్రమంలో చివరగా వచ్చేది క్యాన్సర్ (కర్కాటక రోగం). మంచినీళ్ళు ఎప్పు...